#290యేసుతో ఠీవిగాను పోదమా – అడ్డుగా వచ్చు వైరి గెల్వను
యేసుతో ఠీవిగాను పోదమా – అడ్డుగా వచ్చు వైరి గెల్వనుయుద్ధనాదంబుతో బోదము1. రారాజు సైన్యమందు చేరను – ఆ రాజు దివ్య సేవ చేయను (2)యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను2. విశ్వాస కవచమును ధరించుచు – ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2)అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) – యేసుతో ఠీవిగాను వెడలను3. శోధనలు మనల చుట్టి వచ్చినా – సాతాను అంబులెన్ని తగిలినా (2)భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను4. ఓ యువతి యువకులారా చేరుడి – శ్రీ యేసురాజు వార్త చాటుడి (2)లోకమంత ఏకమై యేసునాథు గొల్వను (2) సాధనంబెవరు నీవు నేనెగా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.