291

యేసుని కొరకై ఇల జీవించెద భాసురముగనే

యేసుని కొరకై ఇల జీవించెద భాసురముగనే ననుదినముదోషములన్నియు బాపెను మోక్షనివాసమున ప్రభు జేర్చునుగా1. నాశనకరమగు గుంటలో నుండియు మోసకరంబగుయూబి నుండి నాశచేనిల పైకెత్తెను నన్ను పిశాచి పధంబున దొలగించెన్2. పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమునుకలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెన్3. అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు4. శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశంవ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడేనా నిరీక్షణగున్5. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమై యున్నవి ప్రభు నందుఅధ్భుతముగ ప్రభువన్నియు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని6. అర్పించెను దన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువుఅర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింప