293

యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరు

యేసుని స్తుతియించువారు – నిత్య జీవము నొందెదరుఆనందముతో దినదినము – సంతోషముగ నుందురుఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా1. వాడబారని ఆకువలె – దినదినము బలమొందెదరుజీవజలపు నది యొడ్డున – వృక్షములవలె పెరిగెదరుఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా2. చీకటి నుండి వెలుగునకు – మరణము నుండి జీవముకుచేయి విడువక తనతో కూడ – యేసే నడిపించునుఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా3. చీకు చింతలు కలిగినను – చెరలు దుఃఖము కలిగిననుకనురెప్పవలె కాపాడి – యేసే విడిపించునుఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా4. నడి సంద్రములో పయనించినా – నట్లడవులలో నివసించినాఎన్నడు మరువక ఎడబాయక – యేసే తోడుండునుఆహా.. హల్లెలూయా.. ఆహా.. హల్లెలూయా