423

యేసు పరిశుద్ధ నామమునకు

యేసు పరిశుద్ధ నామమునకుఎప్పుడు అధిక స్తోత్రము (2)1. ఇహపరమున మేలైన నామముశక్తి గల్గినట్టి నామమిది (2)పరిశుద్దులు స్తుతించు నామమిది (2)2. సైతానున్‌ పాతాళమును జయించువీరత్వము గల నామమిది (2)జయమొందెదము ఈ నామమున (2)3. నశించు పాపుల రక్షించు లోకమున కేతెంచిన నామమిది (2)పరలోకమున చేర్చు నామమిది (2)4. ఉత్తమ భక్తుల పొగడి స్తుతించుఉన్నత దేవుని నామమిది (2)లోకమంతా ప్రకాశించే నామమిది (2)5. శోధన, బాధల, కష్ట సమయానఓదార్చి నడుపు నామమిది (2)ఆటంకము తొలగించు నామమిది (2)