424

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా

రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవాస్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2)1. సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2)శ్రమ అయిననూ బాధ అయిననూ (2)ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునాక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా2. ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2)హింస అయిననూ హీనత అయిననూ (2)ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునాక్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా3. ఎన్నడైన మారని మా యేసుడుండగా (2)ఉన్నవైననూ రానున్నవైననూ (2)ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునాహల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ