610

యేసు నీ నామామృతము

యేసు నీ నామామృతము మా – కెంతో రుచి యయ్యా (2) దేవమా – దోషములను హరించి మోక్షనివాసులుగా జేయుటకు – భాసుర ప్రకాశమైన ||యేసు||వేడు కలరగ గూడి నిను గొని – యాడు వారికి (2) దేవయెంతో – కీడు జేసిన పాడు వైరినిగోడుగో డనంగ వాని – తాడనము జేసితివి ||యేసు||పాపములు హరింప నీవే – ప్రాపు మాకయ్యా (2) దేవనీ – దాపు జేరిన వారి కందరికాపదలు బాపి నిత్య కాపుగతి జూపినావు ||యేసు||అక్షయ కరుణేక్ష భువన – రక్షకా నీవే (2) దేవమమ్ము పక్షముగ రక్షించి మోక్షసురక్షణకు దీక్ష గొని – వీక్షితులమైన మాకు ||యేసు||అందమగు నీ మందిరమున – బొందుగా మేము (2) దేవనీ – సుందర కరుణామృతము మాడెందముల యందు గ్రోలు – టందుకు సుందరమైన ||యేసు||