296

యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన – నన్ను ప్రేమించినావు

యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన – నన్ను ప్రేమించినావు (2)నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి దా-నముగా జీవము సిలువపై (2)ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో(2)1. తల్లి గర్భమున నే ధరియింపబడి నపుడే దురుతుండనై యుంటిని (2)నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండగ (2)2. మంచి నాలో పుట్ట – దంచు నీ వెరిగి నన్ మించ ప్రేమించి-నావు (2)ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచనెంచి ప్రేమించినావు (2)3. నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్నీ మున్నే తెలిసియుంటివి (2)తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమోయన్నా తెలియదు చిత్రము (2)4. నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు (2)ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితోకేవలంబేమీ లేక (2)