297

యేసే గొప్ప దేవుడు

యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తి మంతుడు (2)యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగములు స్తుతి పాత్రుడు (2)స్తోత్రము మహిమ జ్ఞానము శక్తిఘనత బలము కలుగును ఆమెన్ (2)1. మహా శ్రమలలో వ్యాధి బాధలలోసహనము చూపి స్థిరముగా నిలచినయోబు వలెనే జీవించెదను (2)అద్వితీయుడు ఆదిసంబూతుడుదీర్ఘశాంతుడు మన ప్రభు యేసే (2)2. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతోలోకమునకు ప్రభువును చాటినదానియేలు వలె జీవింతును (2)మహోన్నతుడు మన రక్షకుడుఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2)3. జీవితమంత ప్రభుతో నడచిఎంతో ఇష్టుడై సాక్షము పొందినహనోకు వలెనే జీవించెదను (2)అద్భుతకరుడు ఆశ్చర్యకరుడునీతి సూర్యుడు మన ప్రభు యేసే (2)