298

యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి

యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారినా జీవిత కాలమెల్ల ప్రియ ప్రభువే నా పరిహారి (2)1. ఎన్ని కష్టాలు కలిగిననూ నన్ను కృంగించె భాదలెన్నో (2)ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి (2)2. నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా (2)పలు నిందలు నను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి (2)3. మణి మాణ్యాలు లేకున్ననూ పలు వేదనలు వేధించినా (2)నరులెల్లరు నను విడచినా ప్రియ ప్రభువే నా పరిహారి (2)4. బహు వ్యాధులు నను సోకినా నాకు శాంతి కరువైనా (2)నను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి (2)5. దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరూ (2)నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను (2)