400

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా

యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యామెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2)1. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమైనా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు (2)పూజనీయుడా నీతి సూర్యుడానిత్యము నా కనుల మెదలుచున్నవాడా2. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలోమెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2)విజయశీలుడా పరిశుద్ధాత్ముడానిత్యము నాలోనే నిలచియున్నవాడా