62

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంతపంతము తోఁ జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత1. పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటాఅట్టి శ్రమల నొంది పలుకఁ డాయె యేసు స్వామి నాఁడు2. మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపుపైనిమొయ్యలేక మ్రానితోడ మూర్ఛఁబోయె నేసు తండ్రి3. కొయ్యపై నేసయ్యన్ బెట్టి కాలుసేతులలోఁ జీలల్కఠిను లంత గూడి కొట్టిరి ఘోరముగఁ క్రీస్తేసున్ బట్టి4. దాహము గొనఁ జేది చిరకఁ ద్రావ నిడిరి ద్రోహు లకటాధాత్రిఁ ప్రజల బాధ కోర్చి ధన్యుఁడా దివి కేగె నహహా5. బల్లెముతోఁ బ్రక్కన్ బొడవన్ పారె నీరు రక్త మహహాఏరై పారె యేసు రక్త మెల్ల ప్రజల కెలమి నొసఁగు