57

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా

ఎంత దూరమైనా అది ఎంత భారమైనా (2)యేసు వైపు చూడు నీ భారమంత తీరు (2) తీరానికి చేరు (2)1. నడచి నడచి అలసిపోయినావానడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా (2)కలువరి గిరి దనుక సిలువ మోసిననజరేయుడేసు నీ ముందు నడువగా (2)2. తెలిసి తెలిసి జారిపోయినావాతెలియరాని చీకటిలో చిక్కుబడినావా (2)నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడేపరంజ్యోతి యేసు నీ ముందు నడువగా (2)