56

ఎడబాయని నీ కృప

ఎడబాయని నీ కృప – నను విడువదు ఎన్నటికీ (2)యేసయ్యా నీ ప్రేమానురాగం – నను కాయును అనుక్షణం (2)1. శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలోకడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2)అర్ధమేకాని ఈ జీవితం – ఇక వ్యర్థమని నేననుకొనగా (2)కృపా కనికరముగల దేవా – నా కష్టాల కడలిని దాటించితివి (2)2. విశ్వాస పోరాటములో – ఎదురాయె శోధనలులోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2)దుష్టుల క్షేమమునే చూచి – ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2)దీర్ఘశాంతముగల దేవా – నా చేయి విడువక నడిపించితివి (2)3. నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలోనా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2)భారమైన ఈ సేవను – ఇక చేయలేనని అనుకొనగా (2)ప్రధాన యాజకుడా యేసు – నీ అనుభవాలతో బలపరిచితివి (2)