600

యెహోవా నా బలమా

యెహోవా నా బలమాయదార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది నీ మార్గం (2) ||యెహోవా||నా శత్రువులు నను చుట్టిననూనరకపు పాశములరికట్టిననూ (2)వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)విడువక నను ఎడబాయని దేవా (2) ||యెహోవా||మరణపుటురులలో మరువక మొరలిడఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)ఆదరెను ధరణి భయకంపముచే (2) ||యెహోవా||నా దీపమును వెలిగించువాడునా చీకటిని వెలుగుగా చేయును (2)జలరాసులనుండి బలమైన చేతితో (2)వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2) ||యెహోవా||పౌరుషముగల ప్రభు కొపింపగాపర్వతముల పునాదులు వణకెను (2)తన నోటనుండి వచ్చిన అగ్ని (2)దహించివేసెను వైరులనెల్లన్ (2) ||యెహోవా||మేఘములపై ఆయన వచ్చునుమేఘములను తన మాటుగ జేయును (2)ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)అపజయమిచ్చును అపవాదికిని (2) ||యెహోవా||దయగలవారిపై దయ చూపించునుకఠినులయెడల వికటము జూపును (2)గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)సర్వమునెరిగిన సర్వాధికారి (2) ||యెహోవా||నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయునుఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)రక్షణ కేడెము నాకందించి (2)అక్షయముగ తన పక్షము జేర్చిన (2) ||యెహోవా||యెహోవా జీవముగల దేవాబహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)అన్యజనులలో ధన్యత చూపుచు (2)హల్లెలూయ స్తుతిగానము చేసెద (2) ||యెహోవా||