598

యెహోవ నా మొర లాలించెను

యెహోవ నా మొర లాలించెనుదన మహా దయను నను గనించెనుఅహర్నిశల దీనహీనుడగు నాదు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ||పిశాచి గడిమి బడగొట్టెనుదన వశాన నను నిలువ బెట్టెనుప్రశాంత మధుర సు విశేష వాక్ఫలనిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ||మదావలము బోలు నా మదిన్దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్యధేచ్చలన్నిటి గుదించి పాపపుమొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ||అనీతి వస్త్ర మెడలించెనుయే సునాథు రక్తమున ముంచెనువినూత్న యత్నమే ద నూని యెన్నడుగనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ||విలాపములకు జెవి నిచ్చెనుశ్రమ కలాపములకు సెలవిచ్చెనుశిలానగము పై కిలాగి నను సుఖకళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ||అగణ్య పాపియని త్రోయకన న్ను గూర్చి తన సుతుని దా చకతెగించి మృతి కొ ప్పగించి పాపపునెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ||