#135విత్తనం విరుగకపోతే ఫలించునా?
విత్తనం విరుగకపోతే – ఫలించునా? కష్టాలే లేకపోతే – కిరీటమే వచ్చునా? (2)శ్రమలే నా అతిశయం – శ్రమలోనే ఆనందం శ్రమలయందే ఉత్సాహం – విశ్వాసమే నా బలం - (2) 1. పోరాటం దేవునిదైతే – నాకేల ఆరాటం విశ్వసించి నిలుచుంటేనే – ఇస్తాడు విజయ కిరీటం (2) గొల్యాతును పుట్టించినదే – దావీదును హెచ్చించుటకే - 2 కిరీటం కావాలంటే – గొల్యాతులు రావొద్దా? - 2 2. సేవించే మా (మహా) దేవుడు – రక్షించక మానునా? రక్షించక పోయిన సేవించుట మానము (2) ఇటువంటి విశ్వాసమే – తండ్రినే తాకునే - 2 అగ్నిలోకి ప్రభువేరాగా – ఏదైనా హాని చేయునా? - 2 3. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు అధికారులు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిరి (2) ఫరోను పుట్టించినదే ప్రభు శక్తిని చాటుటకే - 2 వాగ్ధానం నెరవేరా ఫరోలు రావొద్దా? - 2

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.