625

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా

విజయశీలుడా నా ప్రాణ ప్రియుడాకృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)నా యేసయ్యా నిను వేడుకొనగానా కార్యములన్నియు సఫలము చేసితివి (2) ||విజయశీలుడా||అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2)ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)నిత్యానందము కలిగించె నీశుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2) ||విజయశీలుడా||ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2)అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచివాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2) ||విజయశీలుడా||ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2)అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2)నిత్యము నీతో నేనుండుటకైనూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2) ||విజయశీలుడా||