#626విధేయతకే అర్ధము చెప్పిన
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడావిధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడాఅవిధేయత తొలగించుమయ్యానీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే||పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివిప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2)సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2)అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత||పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివిప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.