#624విజయ గీతముల్ పాడరే
విజయ గీతముల్ పాడరేక్రీస్తుకు జయ – విజయ గీతముల్ పాడరే (2)వృజిన మంతటి మీద – విజయ మిచ్చెడు దేవనిజ కుమారుని నామమున్హృదయములతో – భజన జేయుచు నిత్యమున్ ||విజయ||మంగళముగ యేసుడేమనకు రక్షణ – శృంగమై మరి నిలచెనునింగిన్ విడిచి వచ్చెనుశత్రుని యుద్ధ – రంగమందున గెల్చెనురంగు మీరగదన – రక్త బలము వలనపొంగు నణగ జేసెనుసాతానుని బల్ – కృంగ నలిపి చీల్చెను ||విజయ||పాపముల్ దొలగింపనుమనలను దన స్వ – రూపంబునకు మార్పనుశాపం బంతయు నోర్చెనుదేవుని న్యాయ – కోపమున్ భరియించెనుపాపమెరుగని యేసు – పాపమై మనకొరకుపాప యాగము దీర్చెనుదేవుని నీతిన్ – ధీరుడై నెరవేర్చెను ||విజయ||సిలువ మరణము నొందియుమనలను దనకై – గెలువన్ లేచిన వానికిచెలువుగన్ విమలాత్మునిప్రేమను మనలో – నిలువన్ జేసిన వానికికొలువు జేతుమెగాని – ఇలను మరువక వానిసిలువ మోయుచు నీ కృపారక్షణ చాల విలువ గలదని చాటుచు ||విజయ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.