620

వర్ష ధారగా రావా నా యేసయ్యా

వర్ష ధారగా రావా నా యేసయ్యాఎండిపోయిన భూమి నేనయ్యా (2)ఈ నేలలో పంట లేదయ్యానా మనస్సులో శాంతి లేదయ్యా (2)వర్ష ధారగా రావా నా యేసయ్యాఫలింపజేయుమా పరమేశ్వరా (2)పాపములన్ని పరిహరించుమాభయములెల్ల పారద్రోలుమా (2)యేసు నాథుడా నా రక్షకా (4)నీదు కృపతో ఆదరించుమా (2) ||వర్ష||మనో వ్యధలను గుణ పరచుమాతనువు గాయమెల్ల స్వస్థపరచుమా (2)యేసు నాథుడా పరమ వైద్యుడా (4)గాయములెల్ల స్వస్థపరచుమా (2) ||వర్ష||