#619లెమ్ము తేజరిల్లుము నీకు
లెమ్ము తేజరిల్లుము నీకువెలుగు వచ్చియున్నది (2)యెహోవా మహిమ నీపైప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము||యేసే యీ లోకమునకువెలుగై యున్నానని చెప్పెన్ (2)యేసుని నమ్మువారు (2)వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము||అంధకార మందుండిబంధింప బడిన వారిన్ (2)ఆశ్చర్యమైన వెలుగు (2)నందించి విమోచించెన్ (2) ||లెమ్ము||దాత ప్రభు యేసుని నమ్మినీతిగా నడుచువారు (2)జాతి భేదములు లేక (2)జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము||మనుజులు మీ సత్క్రియలనుజూచి బహు సంతోషించి (2)మనసారా పరమ తండ్రిన్ (2)మహిమ పరచెదరు (2) ||లెమ్ము||జనములు నీ వెలుగునకుపరుగెత్తి వచ్చెదరు (2)రాజులు నీదు ఉదయ (2)కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.