618

లెమ్ము తేజరిల్లుము అని

లెమ్ము తేజరిల్లుము అనినను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2)నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచురాజాధిరాజువని ప్రభువుల ప్రభువనినిను వేనోళ్ళ ప్రకటించెద (2)ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచకనీతో నడుచుటే నా భాగ్యము (2)శాశ్వత ప్రేమతో నను ప్రేమించినీ కృప చూపితివి (2)ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ…ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము||శ్రమలలో నేను ఇంతవరకునునీతో నిలుచుటే నా ధన్యత (2)జీవకిరీటము నే పొందుటకేనను చేరదీసితివి (2)ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత….ఇదియే నా ధన్యత ||లెమ్ము||తేజోవాసుల స్వాస్థ్యము నేనుఅనుభవించుటే నా దర్శనము (2)తేజోమయమైన షాలోము నగరులోనిను చూసి తరింతునే (2)ఇదియే దర్శనము… ఇదియే దర్శనము…ఇదియే నా దర్శనము ||లెమ్ము||