617

రాజాధి రాజా రారా

రాజాధి రాజా రారా – రాజులకు రాజువై రారారాజయేసు రాజ్యమేల రారా – రవికోటి తేజ యేసు రారా (2)ఓ… మేఘ వాహనంబు మీద వేగమేఓ… మించు వైభవంబు తోడ వేగమే ||రాజాధి||ఓ… భూజనంబులెల్ల తేరిచూడగాఓ… నీ జనంబు స్వాగతంబునీయగానీ రాజ్యస్థాపనంబు సేయ – భూరాజులెల్ల గూలిపోవభూమి ఆకసంబు మారిపోవ – నీ మహా ప్రభావమున వేగ ||రాజాధి||ఆ… ఆకసమున దూత లార్భటింపగాఆ… ఆదిభక్త సంఘ సమేతంబుగాఆకసంబు మధ్య వీధిలోన – ఏకమై మహాసభ జేయయేసు నాధ! నీదు మహిమలోన – మాకదే మహానందమౌగ ||రాజాధి||ఓ… పరమ యెరుషలేము పుణ్య సంఘమాఓ… గొఱియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమాపరమ దూతలార! భక్తులారా! – పౌలపోస్తులారా! పెద్దలారా!గొఱియపిల్ల యేసురాజు పేర – క్రొత్త గీతమెత్తి పాడరారా ||రాజాధి||