#52ఉన్నతమైన స్థలములలో
ఉన్నతమైన స్థలములలో – ఉన్నతుడా మా దేవాఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా1. చెదరి పోయినది మా దర్శనము –మందగించినది ఆత్మలభారంమరచిపోతిమి నీ తొలిపిలుపు –నీ స్వరముతో మము మేలుకొలుపునీ ముఖకాంతిని ప్రసరింపచేసి –నూతన దర్శన మీయుము దేవానీ సన్నిధిలో సాగిలపడగా –ఆత్మతో మము నిలుపుము దేవా2. పరిశోధించుము మా హృదయములను –తెలిసికొనుము మా తలంపులనుఆయాసకరమైన మార్గము మాలో –వున్నదేమో పరికించు చూడుజీవపు ఊటలు మాలోన నింపి –సేదదీర్చి బ్రతికించు మమ్ముమా అడుగులను నీ బండపైన –స్థిరపరచి బలపరచుము దేవా3. మా జీవితములు నీ సన్నిధిలో –పానార్పణముగా ప్రోక్షించెదముసజీవయాగ శరీరములతో –రూపాంతర నూతన మనసులతోనీ ఆత్మకు లోబడి వెళ్ళెదము –నీ కృపచేత బలపడియెదములోకమున నీ వార్తను మేము –భారము తోడ ప్రకటించెదము

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.