379

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును

తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును (2)ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడునుచంక పెట్టుకొని కాపాడును యేసయ్యా1. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువనుచూడుము నా అరచేతులలోనిన్ను చెక్కియున్నాను (2)నీ పాదము తొట్రిల్లనీయను నేనునిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడుఅని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య2. పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీవీడిపోదు నా కృప నీకునా నిబంధనా తొలగదు (2)దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెదనీదు భారమంతా మోసి నాదు శాంతి నొసగెదఅని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య