380

పొందితిని నేను ప్రభువా నీ నుండి

పొందితిని నేను ప్రభువా నీ నుండిప్రతి శ్రేష్ట ఈవులన్ ఈ భువియందు (2)1. జీవిత యాత్రలో సాగి వచ్చితిని (2)ఇంత వరకు నాకు తోడై యుండి (2)ఎబినేజరువై యున్న ఓ యేసు ప్రభువా (2)నా రక్షణ కర్తవు నీవైతివి (2)2. గాలి తుఫానులలోనుండి వచ్చితిని (2)అంధకార శక్తుల ప్రభావమునుండి (2)నీ రెక్కల చాటున నను దాచితివయ్యా (2)నీవే ఆశ్రయ దుర్గంబైతివి (2)3. కష్ట దుఖంబులు నాకు కలుగగా (2)నను చేరదీసి ఓదార్చితివే (2)భయ భీతి నిరాశల యందున ప్రభువా (2)బహుగా ధైర్యంబు నాకొసగితివి (2)4. నా దేహమందున ముళ్ళు నుంచితివి (2)సాతానుని దూతగా నలుగ గొట్టన్ (2)వ్యాధి బాధలు బలహీనతలందు (2)నీ కృపను నాకు దయచేసితివి (2)5. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని (2)కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను (2)కష్ట పరీక్షలయందు నా ప్రభువా (2)జయజీవితము నాకు నేర్పించితివి (2)