#133తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే – తండ్రి నీ ఒడిలో నే ఒదిగితినయ్యా
తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే – తండ్రి నీ ఒడిలో నే ఒదిగితినయ్యా – 21. వేదన లేదు శోధనలేదు – నీ హస్తము విడువనయ్యా – 2 భయమన్నది లేనే లేదు – ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి2. నీ ఉపకారం స్మరియించి – స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను చేయివిడువని నా యేసయ్యా – కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా3. మంచికాపరి జీవకాపరి – హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా – ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా4. నిన్ను నేను పట్టుకొంటిని – భుజముపైన సోలెదను నీ భుజముపైన సోలెదను. నీ రెక్కల నీడలోనుండి – లోకాన్ని మరచితిని ఈ లోకాన్ని మరచితిని5. రేయింపవలు వెతికానయ్యా – నీకై వేచితిని నే నీకై వేచితిని నా జీవితకాలమంతా – నీ నామం చాటెదను నే నీనామం చాటెదను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.