353

సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడా

సుగుణాల సంపన్నుడా స్తుతిగానాలవారసుడాజీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము1. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులేనాట్యమాడెను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే2. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనేనీవు నన్ను నడిపించగలవు నేను నడువ వలసిన త్రోవలో3. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదేనీవు నాకిచ్చే మహిమయెదుట ఇవి ఎన్న తగినవి కావే