#354సుధా మధుర కిరణాల అరుణోదయం
సుధా మధుర కిరణాల అరుణోదయంకరుణామయుని శరణం అరుణోదయం (2)తెర మరుగు హృదయాలు వెలుగైనవిమరణాల చెరసాల మరుగైనది (2)1. దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చిందిపాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)2. లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసేనిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.