649

స్తుతి గానమే పాడనా

స్తుతి గానమే పాడనాజయగీతమే పాడనా (2)నా ఆధారమైయున్నయేసయ్యా నీకు – కృతజ్ఞుడనైజీవితమంతయు సాక్షినై యుందును (2) ||స్తుతి||నమ్మదగినవి నీ న్యాయ విధులుమేలిమి బంగారు కంటే – ఎంతో కోరతగినవి (2)నీ ధర్మాసనము – నా హృదయములోస్థాపించబడియున్నది – పరిశుద్ధాత్మునిచే (2) ||స్తుతి||శ్రేష్టమైనవి నీవిచ్చు వరములులౌకిక జ్ఞానము కంటే – ఎంతో ఉపయుక్తమైనవి (2)నీ శ్రేష్టమైన – పరిచర్యలకైకృపావరములతో నను – అలంకరించితివే (2) ||స్తుతి||నూతనమైనది నీ జీవ మార్గమువిశాల మార్గము కంటే – ఎంతో ఆశించదగినది (2)నీ సింహాసనము – నను చేర్చుటకైనాతో నీవుంటివే – నా గురి నీవైతివే (2) ||స్తుతి||