349

సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర

సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్రఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నోనాట్యమాడినాయి నడివీధిలో నడిపాయినోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే2. చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరుబంతులాడినారు పిడి గుద్దులు గుద్దినారు3. వెనుకనుంచి తన్నింది ఒకరుతనముందు నిలచి నవ్వింది మరియొకరుగేలిచేసినారు పరిహాసమాడినారు4. దాహమని అడిగింది ప్రేమ చేదు దాహమిచ్చింది లోకంచిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు