348

సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్ల

సిలువలో బలియైన దేవుని గొఱ్ఱెపిల్లవిలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటికాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడినా దోషముల నీవు - ప్రియముగను మోసితివా3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేతసురూపము లేక - సోలిపోతివా ప్రియుడా4. నా రోగముల నీపై నమ్రతతో భరియించితృణీకరింపబడి - ప్రాణమర్పించితివి5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించిమౌనము ధరియించి - మరణమైతివా ప్రభువా6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనేమరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకైపదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ