#327శిలనైన నను శిల్పివై మార్చవు
శిలనైన నను శిల్పివై మార్చవు – నాలోని ఆశలు విస్తరింపజేసావు (2)నీ ప్రేమ నాపై కుమ్మరించు చున్నావు (2)నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)1. మొడుబారిన నా జీవితం – నీ ప్రేమతోనే చిగురింపజేసావు (2)నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం (2) – వర్ణించలేను లెక్కించలేను (2)నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)2. ఏ విలువ లేని అభాగ్యుడను నేను – నీ ప్రేమ చూపి విలువనిచ్చినావు(2)నా యెడల నీకున్న తలంపులు విస్తారములు (2) నీ కొరకే నేను జీవింతు నిలలో(2)నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)3. ఊహించలేను నీ ప్రేమ మధురం – నా ప్రేమమూర్తి నీకే నా వందనంనీ ప్రేమే నాకాధారం నా జీవిత లక్ష్యం (2) – నీ ప్రేమ లేక నేనుండలేను (2)నీ ప్రేమే నా ఊపిరి నీ ప్రేమే నా కాపరి(2)

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.