646

సీయోనులో స్థిరమైన పునాది నీవు

సీయోనులో స్థిరమైన పునాది నీవునీ మీదే నా జీవితము అమర్చుచున్నావుసూర్యుడు లేని - చంద్రుడు లేనిచీకటి రాత్రులు - లేనే లేనిఆ దివ్య నగరిలో కాంతులను - విరజిమ్మెదవా నా యేసయ్యా || సీయోనులో ||కడలిలేని - కడగండ్లులేనికల్లోల స్థితిగతులు - దరికే రానిసువర్ణ వీధులలో - నడిపించెదవా - నా యేసయ్యా || సీయోనులో ||కలతలు లేని - కన్నీరు లేనిఆకలి దప్పులు - అసలే లేనినీ శాశ్వత రాజ్యముకై - సమకూర్చుచున్నావా - నా యేసయ్యా || సీయోనులో ||సంఘ ప్రతిరూపము - పరమ యెరూషలేముసౌందర్య సీయోనులో - నీ మనోహరమైన ముఖము దర్శింతునునీతోనే నా నివాసము - నిత్యము ఆనందమే || సీయోనులో ||