#645సీయోనులో నుండి నీవు
సీయోనులో నుండి నీవు – ప్రకాశించుచున్నావు నాపై (2)సమాధానమై – సదాకాలము నను నీతోనడిపించుచున్నావు నీ కీర్తికైసీయోనులో మహోన్నతుడా యేసయ్యా (2)నిర్దోషమైన మార్గములో – నా అంతరంగమున ధైర్యమునిచ్చి (2)నీ సన్నిధిలో నను నిలిపి – ఉన్నత విజయమునిచ్చితివి (2)నీ ఆశలు నెరవేరుటకు – నీ చిత్తము జరిగించుటకువిడువవు నను యెడబాయవునీవు విడువవు నను యెడబాయవు ||సీయోనులో||నాయందు దృష్టి నిలిపి – నీ స్నేహబంధముతో ఆకర్షించి (2)కృపావరములతో నను నింపి – సత్యసాక్షిగా మార్చితివి (2)నీ మనస్సును పొందుకొని – నీ ప్రేమను నింపుకొనికీర్తించెదను ప్రతినిత్యంనిను ఆరాధింతును అనుక్షణము ||సీయోనులో||నీ దివ్యమైన మహిమను – పరలోకమందునే చూచెదను (2)నీ కౌగిలిలో చేర్చుకొని – ప్రతి భాష్పబిందువును తుడిచెదవు (2)నీ మాటల మకరందమును – మరపురాని అనుబంధమునుమరువను ఎన్నడు విడువనునేను మరువను ఎన్నడు విడువను ||సీయోనులో||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.