334

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడి

సంతోషించుడి యందరు నాతో సంతోషించుడియొక వింతగు కీర్తన బాడ వచ్చితినిసంతోషించుడి నాతో సంతోషించుడి1. అంధకార మయమైన భూమి నాద్యంతము వెలిగింప – దాని యా-వేశము దొలఁగింపవందితుండు క్రీస్తేసు నాథుడు – వచ్చె బ్రకాశుండైభూమికి నిచ్చె ప్రకాశంబు2. కాన నంధకారంబు దొలఁగఁ ప్రకాశించెను లెండు – మీరు ప్ర-కాశింపను రెండుమానవులను సంతోష పర్చనై – మహిని నవతరించెభక్తుల మనము సంతసించె3. మిన్ను నుండి సంతోషోదయముమిగుల ప్రకాశించె – హృదయములఁ – దగుల ప్రకాశించెమున్ను జేయబడిన వాగ్ధత్థము – తిన్నగ నెరవేరేభక్తుల కన్ను లాస దీరె4. ప్రీతియైన నీ పండుగ గూర్చినూతన కీర్తనను – గలసికొని – నాతో పాడుచునునీ తరి దూరస్థుల-కీ వార్తను – నే తీరును నైనఁదెలుపఁగ నాతురపడవలెను5. పాపులపై దేవునికి గలిగినప్రబలమైన దయను – లోకమునఁ – జూపింపఁ గవలెనుజూపక పోయిన లోపము మనపై – మోపబడును నిజమువేగము జూపుద మా పథము