643

సాగేటి ఈ జీవ యాత్రలో

సాగేటి ఈ జీవ యాత్రలోరేగేను పెను తుఫానులెన్నో (2)ఆదరించవా నీ జీవ వాక్కుతోసేదదీర్చవా నీ చేతి స్పర్శతో (2)యేసయ్యా.. ఓ మెసయ్యాహల్లెలూయా నీకే స్తోత్రమయా (2) ||సాగేటి||సుడి గాలులెన్నో లోక సాగరానవడిగా నను లాగి పడద్రోసే సమయాన (2)నడిపించగలిగిన నా చుక్కాని నీవే (2)విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే (2) ||యేసయ్యా||వడ గాటులెన్నో నా పయనములోననడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన (2)తడబాటును సరి చేసే ప్రేమ మూర్తి నీవే (2)కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే (2) ||యేసయ్యా||అలల శ్రమలెన్నో బ్రతుకు నావపైనచెలరేగి విలవిలలాడించే సమయాన (2)నిలబెట్టి బలపరిచే బలవంతుడ నీవే (2)కలవరమును తొలగించే కన్న తండ్రి నీవే (2) ||యేసయ్యా||