642

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు

సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచుసాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే (2)సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య||దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి (2)మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య||పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు (2)పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల (2)నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య||పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు (2)బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య||చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన (2)ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య||పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల (2)ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య||ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక (2)తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||