314

రాలి పోదువో నీవు కూలిపోదువో

రాలి పోదువో నీవు కూలిపోదువోతెలియదురా నీకు ఏగడియోపువ్వు రాలు విధమున రాలిపోదువోఅయ్యో! మానవా… మాయరా ఇది మాయరా1. రేపు నీది కాదని తెలుసుకో – బుడగవురా నీవు బ్రతకవురా(2)వట్టివిరా నీవు మట్టివిరా (2)2. కోరకురా నీవు కోర్కెలనూ – ఉండవురా నీవు మన్నువురా(2)కుండవురా నీవు పగిలెదవు (2)3. నీవు పోయినపుడు ఏడ్చెదరేగాని – ఎవ్వరు రారయ్య నీ వెంట(2)ఎందరు ఉన్నా నీవొక్కడివే (2)4. భార్యబిడ్డలు మాయరా – లోక నివాసులు మాయరామర్చిపోదురు ఒక్క దినమే (2)5. శాశ్వతమా నీకు ఈ లోకం – శాశ్వతమయినది పరలోకం (2)మరణించెరా ప్రభు నీ కోసం (2) అయ్యో!… మానవా!…సత్యమురా ఇది సత్యమురా – సత్యమురా ఇది సత్యమురా6. సిలువే శరణము మానవా – సిలువే మార్గము చూడవా (2)ఇదియే తరుణము జేరవా (2) అయ్యో!… మానవా!…సత్యమురా ఇది సత్యమురా – సత్యమురా ఇది సత్యమురా