232

ప్రేమ యేసయ్య ప్రేమా

ప్రేమ యేసయ్య ప్రేమా (4)మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2)1. తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమతండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమాతన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2)2. నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమనేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2)నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమాతన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2)3. నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమనేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2)తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమాఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2)