233

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిదినిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది“అ. పల్లవి” ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ1. తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించునుకన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును2. భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పమువాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును3. బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపమునూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును4. ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవునుక్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును