389

ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి

ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రితన కుమారుని బంపెనురక్తము చిందించి మా పాపము కడుగసిలువపై అర్పించెను1. త్యాగసహిత ప్రేమ జూపినెరవేర్చె తన నిబంధననుమనలను తానే నిర్మించె గనుకమనలను ప్రేమించెను2. శాశ్వత ప్రేమ చూపించెనుసిలువపై ఋజువు గావించెనుతన రక్తముతో పాపులనెల్లశుద్ధుల జేసెనుగా3. తండ్రివలెనే ప్రేమ జూపిపాపులనెల్ల ప్రేమించెనుఎవరు పాపము నొప్పుకొందురోవారిని క్షమించెను4. మా జీవితముల మార్చివేసితన సంతతితో జేర్చెనుగాతన మహాప్రేమ జూపించి మాకుస్వాస్థ్యము దయచేసెను