388

ప్రార్థన వినెడి పావనుడ

ప్రార్థన వినెడి పావనుడప్రార్థన మాకు నేర్పుమయ్యా1. శ్రేష్ఠమైన భావము గూర్చిశిష్య బృందముకు నేర్పితివిపరముడ నిన్ను, ప్రణుతించెదముపరలోక ప్రార్థన నేర్పుమయ్యా2. పరమ దేవుడవని తెలిపికరములెత్తి జంటగమోడ్చిశిరమును వంచి, సరిగను వేడినసుంకరి ప్రార్థన నేర్పుమయా3. దినములోన చేసిన సేవదైవ చిత్తముకు సరిపోవదీనుడవైయి, దిటముగ కొండనుచేసిన ప్రార్థన నేర్పుమయా4. శత్రుమూక నిను చుట్టుకొనిసిలువ పైననిను జంపగనుశాంతముతో నీ, శత్రులబ్రోవగసలిపిన ప్రార్థన నేర్పుమయా