#575ప్రభు యేసు నా రక్షకా
ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2)అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2) ||ప్రభు యేసు||ప్రియుడైన యోహాను పత్మాసులోప్రియమైన యేసు నీ స్వరూపము (2)ప్రియమార జూచి బహు ధన్యుడయ్యెప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||లెక్కలేని మార్లు పడిపోతినిదిక్కులేనివాడ నేనైతిని (2)చక్కజేసి నా నేత్రాలు దెరచిగ్రక్కున నిన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||ఎరిగి యెరిగి నే చెడిపోతినియేసు నీ గాయము రేపితిని (2)మోసపోతి నేను దృష్టి దొలగితిదాసుడ నన్ను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||ఎందరేసుని వైపు చూచెదరోపొందెదరు వెల్గు ముఖమున (2)సందియంబు లేక సంతోషించుచుముందుకు పరుగెత్తెదరు (2) ||ప్రభు యేసు||విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూకొనసాగించువాడా యేసు ప్రభూ (2)వినయముతో నేను నీ వైపు జూచుచువిసుగక పరుగెత్త నేర్పు (2) ||ప్రభు యేసు||కంటికి కనబడని వెన్నియోచెవికి వినబడని వెన్నియో (2)హృదయ గోచరము కాని వెన్నియోసిద్ధపరచితివ నాకై (2) ||ప్రభు యేసు||లోక భోగాలపై నా నేత్రాలుసోకకుండునట్లు కృప జూపుము (2)నీ మహిమ దివ్య స్వరూపమునునిండార నను జూడనిమ్ము (2) ||ప్రభు యేసు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.