219

పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్

పాడెద దేవా నీ కృపలన్ నూతన గీతములన్స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్1. భూమి పునాదులు వేయకముందే యేసులో జూచితివిప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివిఈ దీనుని బ్రోచితివి2. ప్రవిమల రక్తము కలువరి సిలువలో ఖలునకు నిచ్చితివిప్రేమ కృపా మహధైశ్వర్యములతో పాపము తుడిచితివినా పాపము తుడిచితివి3. పాపము శాపము నరకపు వేదన తొలగించితివిఅపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివినను ధర బ్రతికించితివి