81

ఓ సద్భక్తులారా – లోక రక్షకుండు

1. ఓ సద్భక్తులారా – లోక రక్షకుండుబెత్లేహేమందు నేడు జన్మించెన్రాజాధి రాజు – ప్రభువైన యేసునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో2. సర్వేశ్వరుండు – నర రూపమెత్తికన్యకు బుట్టి నేడు వేంచేసెన్మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూనీకు నమస్కరించి నీకు నమస్కరించినీకు నమస్కరించి పూజింతుము3. ఓ దూతలారా – ఉత్సాహించి పాడిరక్షకుండైన యేసున్ స్తుతించుడిపరాత్పరుండా – నీకు స్తోత్రమంచునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో4. యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మఈ వేల స్తోత్రము నర్పింతుముఅనాది వాక్య – మాయే నర రూపనమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో