#80ఓ సంఘమా – సర్వాంగమా
ఓ సంఘమా – సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమామెస్సయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమాఓ సంఘమా – వినుమా1. రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతోవీణ వాద్య తరంగాలలో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతోఆనంద తైల సుగంధాభిషేకమునొందితివే సువాసనుండా2. క్రీస్తే నినును ప్రేమించెనని – తన ప్రాణాలర్పించెననిస్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగమహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసువాసహించుతావా తీర్పునాడు3. చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకుశ్రీకర్త గుణాతిశయములను – ప్రకటించుటకే పిలచెననిగుర్తించుచుంటివా క్రియలను గంటివాసజీవముగా నున్నావా4. చల్లగనైనా వెచ్చగనూ – ఉండిన నీకది మేలగునునులివెచ్చని స్థితి నీకుంటే – బయటకు ఉమ్మబడెదవేమోనీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకోఆసక్తితోడ రక్షణ నొందు (2)5. కడపటి బూర మ్రోగగానే – కనురెప్ప పాటున మారుదువావడిగా మేఘాసీనుడవై – నడియాకాశము పోగలవాగొఱ్రెపిల్ల సంఘమా క్రీస్తు రాజు సంఘమా –రారాజు నెదుర్కొనగలవా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.