426

నిరంతరం నీతోనే జీవించాలనే

నిరంతరం నీతోనే జీవించాలనేఆశ నన్నిలా బ్రతికించుచున్నది (2)నా ప్రాణేశ్వరా యేసయ్యానా సర్వస్వమా యేసయ్యా1. చీకటిలో నేనున్నప్పుడునీ వెలుగు నాపై ఉదయించెను (2)నీలోనే నేను వెలగాలనినీ మహిమ నాలో నిలవాలని (2)పరిశుద్ధాత్మ అభిషేకముతోనన్ను నింపుచున్నావు నీ రాకడకై2. నీ రూపము నేను కోల్పోయినానీ రక్తముతో కడిగితివి (2)నీతోనే నేను నడవాలనినీ వలెనే నేను మారాలని (2)పరిశుద్ధాత్మ వరములతోఅలంకరించుచున్నావు నీ రాకడకై3. తొలకరి వర్షపు జల్లులలోనీ పొలములోని నాటితివి (2)నీలోనే చిగురించాలనినీలోనే పుష్పించాలని (2)పరిశుద్ధాత్మ వర్షముతోసిద్ధపరచుచున్నావు నీ రాకడకై