209

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)అంతా నా మేలుకే – ఆరాధన యేసుకేఅంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితేతన చిత్తమునకు తల వంచితేఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)స్తుతియించుట మానను1. కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనాస్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (4)2. ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనాఊపిరే భరువైనా – గుండెలే పగిలినా (2)యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2)ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2)3. అవమానం ఎంతైనా – నా వారే కాదన్నానీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (4)4. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదుఇక మీదట నేను – తెలిసికొందును (2)ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2)