208

నేనునూ నా ఇంటి వారును యెహోవాను సేవించెదము

నేనునూ నా ఇంటి వారునుయెహోవాను సేవించెదముఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని1. శ్రమలో శోధనలో మరణ బంధకములోశాంతి సమాధానం దయచేసిన దేవుడు (2)ఆశా నిరాశలలో ఆవేదన వలయములో (2)ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2)2. ఏ పాపము నన్ను ఏలనీయని వాడుఏ అపాయమును రాకుండా కాపాడును (2)కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2)3. దీర్ఘాయువు చేత దీవించు దేవుడుదీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2)మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2)మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2)